లండన్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. అయితే జైలు గదిలో ఉన్న అతనిపై ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్‌స్మిత్(Jemima Goldsmith) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి గదిలో ఇమ్రాన్‌ను బంధించారని, అక్కడ విద్యుత్తు సరఫరా లేదని ఆమె ఆరోపించారు. సరైన రీతిలో ఇమ్రాన్‌ను జైలు అధికారులు ట్రీట్ చేయడం లేదన్నారు. కుటుంబసభ్యుల్ని కలుసుకోనివ్వడం లేదని, కోర్టు విచారణలు వాయిదా వేస్తున్నారని, గత సెప్టెంబర్ నుంచి ఇద్దరు కుమారులతో మాట్లాడే వీలు కూడా కల్పించడం లేదని జెమీమా గోల్డ్‌స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు.
In the last few weeks there have been serious and concerning developments regarding my sons’ father, Imran Khan’s treatment in prison. The Pakistan authorities have stopped all visits to him by his family and his lawyers. They have also postponed all court hearings. In addition…
— Jemima Goldsmith (@Jemima_Khan) October 15, 2024
సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ భారీ పోస్టు పెట్టింది జెమీమా. ఇమ్రాన్ ఉంటున్న జైలు గదికి విద్యుత్తు సరఫరా ఆపేశారని, అతన్ని బయటకు రానివ్వడం లేదని, జైలు వంటవాడికి సెలువు ఇచ్చి పంపించారని ఆ పోస్టులో ఆమె ఆరోపించారు. వంటరిగా ఇమ్రాన్‌ను జైలు గదిలో ఉంచారని జెమీమా తెలిపారు. 1995 నుంచి 2004 వరకు జెమీమా, ఇమ్రాన్ కలిసి ఉన్నారు. ఆ జంటకు సులేమాన్, ఖాసిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు లండన్‌లో నివసిస్తున్నారు.
2018 నుంచి 2022 వరకు పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ చేశారు. అయితే ఆయనపై ఇప్పటి వరకు 200 కేసులు నమోదు అయ్యాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని తొలగించారు. సైనిక కుట్ర ద్వారా ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించారు.గత ఏడాది ఆగస్టు నుంచి అతను జైలులో ఉంటున్నాడు.