జూబ్లీహిల్స్,జనవరి6 : రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్ ప్రధాన రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గురువారం కూల్చివేశారు. ప్రారంభోత్సవానికి సి ద్ధంగా ఉన్న ఈ భవనంపై అతి సమీపంలో విద్యుత్ హైటెన్షన్ వైర్లు వెళ్లాయి. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్, టాస్క్‌ఫోర్స్, పోలీసు లతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. పలుమార్లు నోటీసులు ఇచ్చిన భవన యజమానులు స్పందించలేదని అధికారులు తెలిపారు. దీంతో భవన యజమానులు ఒక్కరోజు వ్యవధిలో తామే స్వయంగా నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో తొలగింపులు చేపడుతామని అధికారులకు విన్నవించారు.