హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : గ్రామీణాభివృద్ధి రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ (బీఎఫ్ఆర్ఎస్) కోర్సును ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) వెల్లడించింది.
ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 16లోపు ప్రవేశాలు పొందవచ్చని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బొల్లా తెలిపారు. వివరాలకు www.ignou.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఇంటర్ తత్సమాన అర్హతలు గలవారు ఈ కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు నేరుగా పీహెచ్డీ కోర్సులో ప్రవేశాలకు అర్హత సాధిస్తారని తెలిపారు.