‘తెలంగాణ సర్కారు అధిక సంఖ్యలో కొలువులను భర్తీ చేయనున్న నేపథ్యంలో యువత పక్కా ప్రణాళికతో సిద్ధమవ్వాలి. అప్పుడే ఆశించిన పోస్టు సొంతమవుతుంది. కష్టపడి చదవడంతో పాటు ఎలాంటి పుస్తకాలను ఎంచుకోవాలి. ఏ విధంగా తయారవ్వాలి.. ఏఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. నోట్స్ ప్రిపరేషన్, అనుసరించాల్సిన మెళకువలపై నిపుణులు సలహాలు సూచనలు పాటించాలి. మానసిక, శారీరక సన్నద్ధతతో ముందుకెళ్లినప్పుడే విజయం సొంతమవుతుంది.’ కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మంతెన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఉద్యోగార్థులకు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రిపరేషన్ వ్యూహం, టైం టేబుల్, సిలబస్‌పై అవగాహన, ఎంచుకునే మెటీరియల్, కోచింగ్.. ఇలా చాలా విషయాలపై వివరించారు. ఆయన మాటల్లోనే..
– కరీంనగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ జాగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, ఆర్థమెటిక్, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ ఇంగ్లిష్
‘పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ కోసం మంచి పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. వీటిలో తెలుగు అకాడమీ బుక్స్‌ని మించినవి లేవు. మా స్టడీ సర్కిల్ తరఫున కూడా పదకొండు పుస్తకాలు ప్రిపేర్ చేశాం. ప్రత్యేక మెటీరియల్‌ను ప్రతి రోజూ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నాం. వీటితోపాటు కరెంట్ ఎఫైర్స్ కూడా సమకూర్చుతున్నాం. వంద ప్రశ్నల నిధి, మోటివేషన్ స్టోరీస్ ఇస్తున్నాం. మెటీరియల్ కోసం BC STUDY CIRCLE KARIMNAGAR టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కావాలి.’ అని నిరుద్యోగ యువతకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మంతెన రవికుమార్ సూచించారు. ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పక్కా ప్రణాళికతో ప్రిపేర్ కావాలని, ఒక టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని, కష్టపడితే సర్కారీ కొలువు ఖాయమని చెబుతున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా టైం టేబుల్ మెయింటెన్ చేయాలి. రోజుకు కనీసం 10 నుంచి 12 గంటలు చదవాలి. ఉదయం 4 గంటల నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. కఠినమైన సబ్జెక్టులను ఉదయాన్నే చదవాలి. ఈ సమయంలో ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. చదివిన ప్రతి విషయం గుర్తుంటుంది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు తప్పని సరిగా టైం టేబుల్ ఉండాలి. మధ్యాహ్నం రెండు గంటల పాటు చదివిన ప్రతి అంశాన్ని రివిజన్ చేసుకోవాలి. తిరిగి సాయంత్రం మరో 4 నుంచి 6 గంటలు టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటే మంచిది. ఎవరి అలవాటు ప్రకారంగా వాళ్లు ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదవాలి. రెండు మూడు రోజులకు ఒక సబ్జెక్ట్ మార్చుకోవాలి. అయితే ప్రతి రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివితే మంచి ఫలితం ఉంటుంది.
టఫ్‌గా ఉన్న సబ్జెక్టులను ఉదయం 4 గంటల నుంచి చదివితే మంచిది. ఇలాంటి సబ్జెక్ట్‌లను రోజుకు రెండు సార్లు చదవడంలో కూడా తప్పు లేదు. చదువుకుంటూనే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బిట్ బ్యాంక్‌ను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ గుర్తుండిపోయేలా చేసుకోవాలి. మాక్ టెస్టులు సొంతంగా నిర్వహించుకోవడం వల్ల ఎప్పటికపుడు సామర్థ్యం తెలిసి పోతుంది. ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ కోసం ఒక తెలుగు, ఒక ఇంగ్లిష్ పేపర్ చదవడం మంచిది. కరెంట్ అఫైర్స్ కోసం ఒక నోట్ పెట్టుకుని ప్రతి రోజు రాసుకుని నాలుగైదు రోజులకు ఒక సారి రివిజన్ చేసుకోవాలి. నోటిఫికేషన్ రావడానికి ఏడాది ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.
అభ్యర్థులు ప్రిపరేషన్ వ్యూహంతో ముందుకెళ్లాలి. ప్రతి సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోవాలి. 6వ నుంచి 10వ తరగతి, ఇంటర్ నుంచి డిగ్రీ పుస్తకాలు కూడా చదవాలి. సెంట్రల్ సిలబస్ కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. జనరల్ నాలెడ్జ్‌లో స్టాక్ పుస్తకాలు చదవడం కన్నా దిన పత్రికల్లో వచ్చే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. న్యూస్ పేపర్‌తోపాటు మంత్లీ మ్యాగజన్స్ కూడా చదవాలి. అందులో యోజన, ఉద్యోగ పర్వం, విజేత కాంపిటేషన్ వంటివి మంచివి. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం మంచిది. ప్రైవేట్ పుస్తకాల కంటే ఇందులోనే సమగ్ర సమాచారం ఉంటుంది.
తెలంగాణ బీసీ స్టడీ సరిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశం కల్పించాం. టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రతి రోజూ మెటీరియల్ అందిస్తున్నాం. ఉద్యోగ నోటిఫికేషన్లు, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నాం. ప్రతిరోజు దాదాపు వంద ప్రశ్నలు నిధి, మోటివేషనల్ స్టోరీస్ పంపిస్తున్నాం. మెటీరియల్ కోసం BC STUDY CIRCLE KARIMNAGAR టెలిగ్రాం గ్రూపులో జాయిన్ కావాలి.
తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే పోటీ పరీక్షల్లో మంచి స్కోర్ చేయవచ్చు. క్వశ్చన్ బ్యాంక్‌లను సబ్జెక్ట్ వారీగా చదవాలి. అందులో భూగోళ శాస్త్రం, తెలుగు సాహిత్యం, సమాజ శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం ఉంటాయి. ఇంగ్లిష్ మీడియం జనరల్ ఇంగ్లిష్ చదవాలి. ఇలాంటి పుస్తకాల్లో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ పుష్కలంగా లభిస్తుంది.
పోటీ పరీక్షలో మంచి స్కోర్ సాధించాలంటే మంచి పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. వీటిలో తెలుగు అకాడమీ బుక్స్‌ని మించినవి లేవు. మా స్టడీ సర్కిల్ తరఫున కూడా పదకొండు పుస్తకాలు ప్రిపేర్ చేశాం. అందులో తెలంగాణ జాగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, ఆర్థమెటిక్, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ ఇంగ్లిష్ వంటివి ప్రత్యేక మెటీరియల్‌తో రూపొందించాం. ఈ మెటీరియల్‌ను ప్రతి రోజు అభ్యర్థుల కోసం టెలిగ్రాం గ్రూప్‌లో పోస్టు చేస్తున్నాం. వీటితోపాటు కరెంట్ ఎఫైర్స్ కూడా అభ్యర్థులకు సమకూర్చుతున్నాం.
మీకు తెలిసిన వాళ్ల సలహాలు, ఇంతకు ముందు పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించిన వాళ్ల సహాయం తీసుకోవాలి. ఉపాధ్యాయులు, రిటైర్డ్ అధికారులు నుంచి మంచి సూచనలు తీసుకుంటే ఫలితం వేరేలా ఉంటుంది. కొన్ని యూట్యూబ్ చానళ్లు కూడా మంచి సమాచారాన్ని అందిస్తున్నాయి. సబ్ టాపిక్స్ కోసం వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎంత చదివినా అర్థం కాని సబ్జెక్ట్‌ల కోసం తప్పని సరి కోచింగ్ తీసుకుంటే మంచిది.
1 తెలంగాణ మూవ్మెంట్ (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)
2, ఇండియన్ పాలిటీ (భారత రాజనీతి శాస్త్రం)
3, ఇండియన్ జియోగ్రఫీ (భారత భౌగోళిక శాస్త్రం)
4, ఇండియన్ ఎకానమి (భారత ఆర్థిక శాస్త్రం)
5, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ
6, ఎన్విరాన్మెంట్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం)
7, సొషియాలజీ (సామాజిక శాస్త్రం)
8, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్
9, ఇండియన్ హిస్టరీ