అందం కోసం క్రీములను ఆశ్రయిస్తే.. అలర్జీలు దాడిచేస్తాయి. కొన్నిరకాల రసాయనాలు.. చర్మానికి హాని కలిగిస్తాయి. సహజసిద్ధమైన ఉత్పత్తులు ధర ఎక్కువ. ఇంట్లోనే తయారు చేసుకుందామంటే.. శ్రమ ఎక్కువ. ఈ సమస్యలన్నిటికీ ‘ఆవిరి’ చెక్ పెడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. రెండు రోజులకు ఒకసారి ముఖానికి ఆవిరి పట్టిస్తే.. అందం రెట్టింపు అవుతుంది.