హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) కోరిం ది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరి నుంచే ప్రీమియం కట్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గౌడ్ కోరారు.
ఈహెచ్ఎస్పై అనుమానాలు తీర్చాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)పై ఉపాధ్యాయులు, ఉ ద్యోగుల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వా త ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తేనే ఈహెచ్ఎస్ పథకంలో చేరుతామని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం(సీపీఎస్ఈయూ) స్పష్టంచేసింది. ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఉచిత ఆరోగ్య భద్రత కల్పించకుండా జీతాల నుంచి 1.5% చందా వసూలు చేయడం దారుణమన్నారు.