Nani | ప్రేక్షకుల్లో నేనూ ఒకడినే అనుకుంటా!.. మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా థియేటర్లకు వస్తారు: నాని
‘ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదనే మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే వారు తప్పకుండా థియేటర్లకు వస్తారు. ‘హిట్-3’ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఆడియెన్స్ ఈ సినిమా చూడాలని ముందే ఫిక్సైపోయారనిపిస్తున్నది’ అన్నారు హీరో నాని. ఆయన తాజా చిత్రం ‘హిట్-3’ నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Nani | ‘ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదనే మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే వారు తప్పకుండా థియేటర్లకు వస్తారు. ‘హిట్-3’ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఆడియెన్స్ ఈ సినిమా చూడాలని ముందే ఫిక్సైపోయారనిపిస్తున్నది’ అన్నారు హీరో నాని. ఆయన తాజా చిత్రం ‘హిట్-3’ నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
- ‘హిట్-3’ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో నేను పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తా. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్ని నిర్వహించాం. అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా చూడాలని ఆడియెన్స్ ముందే ఫిక్సైపోయారనిపించింది. ‘హిట్-3’ యాక్షన్, వయొలెన్స్ కలబోసిన కథ. ఈ సీక్వెల్‌లోని రెండు భాగాలతో పోల్చితే చాలా ైస్టెలిష్‌గా ఉంటుంది. కథ డిమాండ్ మేరకే వయొలెన్స్‌ను చూపించాం. అంతేకాని కేవలం వయొలెన్స్ కోసం సినిమా తీయలేదు.
- ఫ్యామిలీ కథల నుంచి వయొలెన్స్ జోనర్‌కు ఎందుకు షిఫ్ట్ అయ్యావని చాలా మంది అడుగుతున్నారు. ప్రతి సినిమాను నేను కొత్త జోనర్లో చేయాలని ప్రయత్నం చేస్తాను. హాయ్ నాన్న, జెర్సీ, దసరా..ఇప్పుడు ‘హిట్-3’ ఇలా వేటికవే డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నా. ఈ ప్రక్రియను నేను మార్పులా చూడటం లేదు. కెరీర్ ముందుకుసాగుతున్న కొద్దీ కొత్త కథలను ఎంచుకుంటున్నా. వయసు పెరుగుతుంది కాబట్టి ప్రేమకథలకు దూరంగా ఉంటున్నా.
- ఈ సినిమాలో వయొలెన్స్ ప్రేక్షకుల్ని డిస్టర్బ్ చేయదు. ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఓ లక్ష్యం కోసం పోలీస్ అధికారి చేసే దుష్ట సంహారం కథలోని హింసను కన్విన్స్ చేసేలా అనిపిస్తుంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమాలకు పనిచేయలేదు. ఆయన ఈ కథకు వర్క్ చేస్తే ఆ సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుందని భావించాం. అనుకున్న విధంగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త ఫీల్‌ని తీసుకొచ్చింది.
- నటుడిగా నా వృత్తిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను. అందుకే ఇలాంటి ఇంటెన్స్ క్యారెర్టర్ చేసినా ఏమాత్రం కష్టమనిపించలేదు. మనం చేసే పనిలో ఎక్సైట్మెంట్ ఉంటే అస్సలు కష్టంగా అనిపించదు. ఇక ఇండస్ట్రీలోని నెంబర్‌గేమ్, వసూళ్ల్ల రికార్డులపై నాకు అంతగా నమ్మకం లేదు. ఆ విషయాల్లో నేను కాస్త వీక్ (నవ్వుతూ).
- నటుడిగా, నిర్మాతగా నాకు సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ అని చాలా మంది చెబుతున్నారు. సినిమాను బాగా ప్రేమిస్తూ, నిజాయితీగా పనిచేయడం వల్లే నాపై ప్రేక్షకులకు ఓ నమ్మకం ఏర్పడింది. ప్రేక్షకుల్లో నేను కూడా ఓ భాగమే అనే భావనతో సినిమాలు చేస్తున్నాను. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయనుకుంటున్నా. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం ఎపిక్ స్కేల్లో ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

