సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని గురునగర్ కాలనీ పాత పెరుమాళ్ల గుడి వద్ద మంగళవారం ఇంటి స్థలాన్ని చదు ను చేస్తుండగా భవాని అమ్మవారి పురాతన విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. కౌన్సిలర్ సాలేని లలిత శ్రీశైలం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. – సదాశివపేట