Idly Kadai | ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాయన్’, జాబిలమ్మ నీకు అంత కోపమా వంటి సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు తమిళ నటుడు ధనుష్. అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు)’. ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. నిత్యమీనన్ కథానాయికగా నటిస్తుంది. అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విడుదలను వాయిదా వేసింది. ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాతో పాటు ఇళయరాజా బయోపిక్, శేఖర్ కమ్ముల కుబేరా సినిమాలో నటిస్తున్నాడు ధనుష్.
తిరుచిత్రబలం సినిమా తర్వాత నిత్యమీనన్, ధనుష్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Idli kadai #oct1 pic.twitter.com/9EkllemSPt
— Dhanush (@dhanushkraja) April 4, 2025