టాలీవుడ్ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదీ రిలీజై సంచలన విజయం సాధించింది. పాండమిక్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఓ కళ తీసుకొచ్చింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పోటీగా ’83’, ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ వంటి సినిమాలు ఉన్నా..పుష్ప ధాటికి వాటి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సుకుమార్ బ్రిలియంట్ టేకింగ్, విజన్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక బన్నీ నటనకు భారతీయ సినీ ప్రేమికులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో బన్నీకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కాగా శనివారంతో ఈ సినిమా ఏడాది పూర్తిచేసుకుంది. మరి థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం.
నైజాం : 38.10 కోట్లు
సీడెడ్ : 15.70 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.94 కోట్లు
ఈస్ట్ : 4.76 కోట్లు
వెస్ట్ : 4.09 కోట్లు
కృష్ణా : 4.30 కోట్లు
గుంటూరు : 5.16 కోట్లు
నెల్లూరు : 3.55 కోట్లు
ఏపీ+తెలంగాణ : 83.06 కోట్లు(131.5 కోట్ల గ్రాస్ )
తమిళనాడు : 12.60 కోట్లు
కేరళ : 6.00 కోట్లు
కర్ణాటక : 12.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 55.90 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 187.5 కోట్లు(360 కోట్ల గ్రాస్)
రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు సాధించింది. రూ. 145 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం దాదాపు రూ.187 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక సినీ సెలబ్రెటీల నుండి రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమాలోని బన్నీ మేనరిజంలను, డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్ చేశారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ‘పుష్ప-2’ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.