దుబాయ్: మహిళల క్రికెట్లో అద్భుత ఫామ్‌తో దూకుడు కనబరుస్తున్న భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన ఐసీసీ మహిళల ‘టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డుకు నామినేట్ అయింది. ఆమెకు పోటీగా ఇంగ్లండ్ క్రికెటర్లు తమ్మీ బ్యూమౌంట్, నట్ సివర్, ఐర్లాండ్ ప్లేయర్ గాబీ లెవిస్ కూడా అవార్డుకు నామినేట్ అయ్యారు. 2021లో 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన మందన 31.87 సగటుతో 255 పరుగులు చేసింది. వీటిలో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మందన తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్నందించింది.