iBOMMA Ravi : సినిమాల పైరసీ కేసులో అరెస్టైన్ iBOMMA రవి 12 రోజుల కస్టడీ ముగిసింది. దాంతో, సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పరచారు. అనంతరం మీడియాతో ఇమంది రవి మాట్లాడుతూ.. ibomma నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించాడు.
కస్టడీ ముగియడంతో iBOMMA రవిని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అతడిని మీడియా చుట్టుముట్టింది. అంతేకాదు మీడియాకి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? మీరేమైనా కోర్టులా? అంటూ మీడియా వారితో తలపొగరుగా అన్నాడు రవి.
iBOMMA నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా?
ముగిసిన iBOMMA రవి 12 రోజుల కస్టడీ
నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు
ibomma నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు?
మీ మీడియాకి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి, మీరేమైనా కోర్టులా అంటూ మీడియాకు… https://t.co/wDxWtT9ZMT pic.twitter.com/75RshMmiGd
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
ఐబొమ్మ నాది కాదు.. నాది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా?
నేను కూకట్ పల్లిలోని ఉన్నా.. విదేశాలకు పారిపోలేదు
పోలీసులు చెప్తే అయిపోతుందా?
నేను ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్తా.. మీడియాతో చెప్తే ఏం జరుగుద్ది – ఇమ్మడి రవి
Video Credits – Tv9 https://t.co/RRXRPrJOhd pic.twitter.com/0NI0bop3KR
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
సినిమాల పైరసీతో నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇమంది రవిని నవంబర్ 18న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు పాల్పడినందున అతడిపై మొత్తంగా ఐదు కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు, బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో మరో కేసు పెట్టారు.
పలువురు సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా రవిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఐదు కేసుల విషయంలో పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్టు చేసి విచారించారు. పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? అతని వెనుక ఇంకా ఎవరెవరున్నారు? అతను ఒక్కడే ఈ పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను నడిపాడా? లేదా గ్రూపుగా పనిచేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో రవి తన స్నేహితుల సర్టిఫికెట్లు దొంగిలించాడనే విషయం వెలుగులోకి వచ్చింది.