న్యూఢిల్లీ, మార్చి 27: 29-31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదాయ పన్ను కార్యాలయాలు తెరిచివుండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను పన్ను చెల్లింపుదారులు తమ పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ శని, ఆది, సోమవారాల్లో ఆఫీస్లను తెరిచివుంచుతున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుండటంతో అదేరోజు ప్రభుత్వ చెల్లింపులు పూర్తి చేయాల్సి వుంటుంది.