ఈ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయం సాధించింది. సినిమా విడుదలై మూడో వారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయిన ఈ యువ దర్శకుడు ఆ తరువాత సాయి ధరమ్ తేజ్‌తో సుప్రీమ్, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకీ, వరుణ్‌లతో ఎఫ్-2, మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు, వెంకీతో ఎఫ్-3, బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పుడు తాజాగా వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం అయితే ఈ ఎనిమిది చిత్రాల్లో రెండు యావరేజ్ సినిమాలు కాగా మిగతా ఆరు సినిమాలు మంచి విజయాలు సాధించినవే. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అయితే తను ఇంత సాధించిన తనకు తెలుగు సినీ పరిశ్రమలో సరైన రెస్పెక్ట్ లేదని క్రిటిక్స్ కూడా తనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వట్లేదని చెబుతున్నాడు అనిల్ రావిపూడి.
ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు ఆయన మాట్లాడుతూ ” ఎనిమిది సక్సెస్‌లు వచ్చినా నాకు తెలుగు సినీ పరిశ్రమలో,క్రిటిక్స్ దృష్టిలో సరైన గుర్తింపు లేదు. రావాల్సినంత రెస్పెక్ట్ రావడం లేదు. అది ఎందుకో నాకు తెలియదు. కానీ నాకు ప్రేక్షకులు అందించే ప్రేమే ముఖ్యం. వాళ్లు నా ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు. అయితే నా విషయంలో సినీ విమర్శకుల తప్పు కూడా ఏమీ లేదు. వాళ్లకు నచ్చే సినిమాలు వేరుగా ఉంటాయి. మన సినిమాలు అందరికి నచ్చాలని నిబంధన ఏమీ లేదు. అయితే కొంత మంది దర్శకులకు చిన్న విషయంలో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎలివేషన్ ఇస్తుంటారు. కానీ నా విషయంలో ఇన్ని విజయాలు సాధించిన ఎందుకో రావాల్సిన గుర్తింపు కూడా రావడం లేదు. కానీ అందరికి చివరిగా ఆడియన్స్‌కు సినిమా నచ్చితేనే అది సక్సెస్.
ఆడియన్స్ టిక్కెట్స్ కొనుక్కొని సినిమాకు వెళ్లడం కావాలి. ఆ విషయంలో నేను నూటికి నూరుశాతం సక్సెస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయంతో ఆడియన్స్ నా పై మరో సారి తమ ప్రేమను చూపారు. నా సినిమాల పట్ల వాళ్ల అభిప్రాయాన్ని కుండ బద్డలు కొట్టి చెప్పారు. అయితే నా పట్ల ఉన్న కేర్లెస్ భావం ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు తగ్గింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయంతో అది ఇంకా తగ్గిందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో నేను మరిన్ని గొప్ప విజయాలు అందించడానికి ప్రయత్తిస్తాను. సో. వాళ్లు అప్పుడైనా నా ప్రతిభను గుర్తించి రెస్పెక్ట్ ఇస్తారేమో చూడాలి’ అంటూ తన మనసులోని ఆవేదనను వ్యక్తపరిచాడు అనిల్ రావిపూడి.