కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొటుంది. బెంగాల్‌తో జరుగుతున్న పోరులో లక్ష్యం పెద్దది కాకపోయినా.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 242, హైదరాబాద్ 205 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ టీమ్ 201 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (51) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్, తిలక్ వర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో హైదరాబాద్ ముందు 239 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే కష్టతరం కాని ఛేదనలో మన జట్టు తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తన్మ య్ అగర్వాల్ (0), అక్షత్ రెడ్డి (0), మికిల్ జైస్వాల్ (5) పెవిలియన్ చేరగా.. తిలక్ వర్మ (11) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న హైదరాబాద్ విజయానికి 223 పరుగుల దూరంలో ఉంది.