వాషింగ్టన్, అక్టోబర్ 18: అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీవోవో), డిప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్కు చెందిన తుమ్మలపల్లి వినయ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ సోమవారం నిర్ణయం తీసుకొన్నారు. వినయ్ వయసు 66 ఏండ్లు. 1974లో చదువు కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2009-13 వరకు బెలీజ్ దేశానికి అమెరికా రాయబారిగా పనిచేశారు.