e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News తొందరపడి..స్కాన్‌ చేయకు..

తొందరపడి..స్కాన్‌ చేయకు..

  • ఏమరుపాటుగా ఉంటే.. ఖాతా ఖల్లాస్‌
  • క్యూ ఆర్‌ కోడ్‌ ఇమేజ్‌లు రూపొందించుకుంటున్న సైబర్‌ మాయగాళ్లు
  • డార్క్‌నెట్‌లో బిట్‌కాయిన్‌తో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు
  • అమాయకులకు బురిడీ.. అందినంత దోపిడీ
  • 175 కేసుల్లో రూ. 30 లక్షలు లూటీ..

‘ఎవరైనా క్యూ ఆర్‌ కోడ్‌ పంపిస్తామంటే..తొందరపడి స్కాన్‌ చేయకండి.. ఏమరుపాటుగా ఉంటే.. మీ ఖాతాలు ఖాళీ కావడం ఖాయం’ అని హెచ్చరిస్తున్నారు సైబర్‌ క్రైం పోలీసులు. రోజురోజుకు పెట్రేగిపోతున్న ఆన్‌లైన్‌ దొంగలు.. ఇప్పుడు క్యూ ఆర్‌ కోడ్‌ ఇమేజ్‌లను సొంతంగానే రూపొందించుకుంటున్నారు. డార్క్‌నెట్‌లో ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను
బిట్‌కాయిన్‌ ద్వారా చెల్లించి చేజిక్కించు కుంటున్నారు. ఆ సాఫ్ట్‌వేర్‌తో రోజుకు కొన్ని వేల క్యూర్‌ కోడ్‌లను సృష్టించి.. అమాయకులకు గాలం వేస్తున్నారు. లక్షలు కొల్లగొడుతున్నారు.

సిటీబ్యూరో, డిసెంబర్‌ 1(నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఎవరైనా మనకు డబ్బులు పంపిస్తే..దానికి క్యూఆర్‌ కోడ్‌ అవసరం ఉండదు. యూపీఐ ఐడీలు లేదా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారానైనా.. అవి నేరుగా మన ఖాతాలోకి వచ్చి పడతాయి. షాపింగ్‌ చేసినప్పుడు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసినా.. ఆ దుకాణంలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి..పిన్‌ నంబర్‌ టైప్‌ చేసిన తర్వాత నగదు సంఖ్యను టైప్‌ చేయాలి. పే అనే ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే..అప్పుడు మన ఖాతాలో నుంచి వారికి డబ్బు వెళ్తుంది. అయితే సైబర్‌ నేరగాళ్లు పంపే క్యూ ఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయగానే ఆటోమెటిక్‌గా బాధితుల ఖాతాల నుంచి నగదు బదిలీ అయ్యేలా రూట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

- Advertisement -

‘రిసీవ్డ్‌’ అని ఉంటుంది..
క్యూ ఆర్‌ కోడ్‌తో సైబర్‌ మోసాలకు పాల్పడే వారి అడ్డాలు రాజస్థాన్‌ భరత్‌పుర్‌, జార్ఖండ్‌ జామ్‌తారాలో అధికంగా ఉంటాయి. క్యూఆర్‌కోడ్‌ ఇమేజ్‌లను రిసీవ్డ్‌ అనే అక్షరాలతో రూపొందించుకుంటారు. వీటిని బాధితులకు పంపగానే.. ఇమేజ్‌లోనే రిసీవ్డ్‌ అని ఉండటంతో చాలా మంది నిజంగానే.. డబ్బులు వచ్చాయని క్లిక్‌ చేస్తున్నారు. ఆ క్లిక్‌తో క్యూఆర్‌కోడ్‌ తెరుచుకొని.. పిన్‌ నంబర్‌ అడుగుతుంది. ఆ సంఖ్యను టైప్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్లు ముందుగానే ఆప్షన్‌లో టైప్‌ చేసిన నగదును మన ఖాతా నుంచి మళ్లించుకుంటారు. క్యూ ఆర్‌ కోడ్‌ సాఫ్ట్‌వేర్‌ను చైనా హ్యాకర్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హోల్డ్‌లోనే పెడతారు..
క్యూ ఆర్‌ కోడ్‌లు పంపే సమయంలో వాటిని పరిశీలించకుండా.. బాధితులతో ఫోన్‌లో మాట్లాడి.. దానిని క్లిక్‌ చేసే విధంగా చేస్తారు. సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనేట్‌ పరిధిలో ఈ ఏడాదిలో మొత్తం 175 మంది బాధితులు ఇలా క్యూ ఆర్‌ కోడ్‌ మోసాల బారిన పడి..సుమారు రూ. 30 లక్షలు పోగొట్టుకున్నారు.

ప్రాథమిక అంశాలు గుర్తు పెట్టుకోవాలి
క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తున్నారంటే మీకు యూపీఐ ఐడీలు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ఐడీలతో లావాదేవిలు జరిపే విధంగా అవగాహన ఉండాలి. ఎందుకు, ఎప్పుడు క్యూ ఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేస్తారనే విషయాలను తెలుసుకోవాలి. ఎవరైనా ఫోన్‌లో మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయమంటే.. ఆలోచించాలి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement