హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వీడియో డేటింగ్లలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆన్లైన్ డేటింగ్, జియో సోషల్ నెట్వర్కింగ్ యాప్ టిండర్ నిర్వహించిన ఇయర్ ఇన్ స్వైప్-2021 సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే ఉన్నాయి. వీడియో కాల్ వృద్ధిలో టిండర్ 52 శాతం వృద్ధిని సాధించింది. టిండర్ యాప్‌లో ఇన్‌యాప్ వీడియోకాల్ ఫీచర్‌ను ప్రవేశ పెట్టడంతో ఇది విజయవంతమైందని సర్వేలో పేర్కొన్నది. యాప్‌లో చాలా మంది నియర్ బై, క్లోజ్ బై వంటి కీ వర్డ్స్ ఎక్కువగా వినియోగించారని, వ్యాక్సినేషన్ స్టేటస్‌ను టిండర్‌లో ఎక్కువమంది పెట్టుకొన్నారని తెలిపింది. జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకు సర్వే నిర్వహించారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన వారి నుంచి సమాచారం సేకరించారు. డేటింగ్ యాప్‌లో రకరాల అంశాలపై ఆసక్తి కనబర్చారు. ఇందులో ప్రధానంగా పిక్నిక్ ఇన్ ఎ పార్క్, వర్చువల్ మూవీ నైట్, సైక్లింగ్, పొట్టెరీ అంశాలు ఉన్నాయి.