సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: ఐటీఐలలో శిక్షణ పొందే విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ కమిషనర్ కేవై నాయక్ అన్నారు. మల్లేపల్లి మోడల్ ఐటీఐలో మల్టీ మీడియా డిజిటలైజ్డ్ తరగతి గదిని జేడీ ఎస్వీకే నగేశ్, డీడీ ఎస్.రాజా, ఆర్డీడీ ప్యారం నర్సయ్య, ప్రిన్సిపాల్ పుప్పాల జ్యోతిరాణి, శిక్షణాధికారి, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మల్టీ మీడియా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66 ఐటీఐలలో పలు ట్రేడ్ల శిక్షణాధికారులు, విద్యార్థులతో ము చ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒకే సమయంలో ట్రేడ్ కోర్సులు ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్, డ్రాయింగ్, కోపా, ఎంప్లాయిబుల్ స్కిల్స్‌తో పాటు ఇతర కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు ఈ మల్టీ మీడియా డిజిటలైజ్డ్ ఆన్లైన్ తరగతి ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఐటీఐలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఆయా ట్రేడ్లలో మెరుగైన శిక్షణను ఇస్తున్నామని తెలిపారు.