ఎల్బీనగర్, ఫిబ్రవరి 28: ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ బోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. సోమవారం కొత్తపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశం, కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్‌గౌడ్, సీనియర్ నాయకులు బొగ్గారపు శరత్, బొగ్గారపు వరుణ్, అశోక్‌జైన్, బాబు, శ్రీకాంత్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మారావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.