
జీడిమెట్ల, నవంబర్ 11 : తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి మోసం చేసిన కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్‌లోని జీనియస్ హైస్కూల్‌ను హైదరాబాద్ ప్రాంతీయ విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి గురువారం సీజ్ చేశారు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు సదరు పాఠశాల యాజమాన్యం విద్యాశాఖకు అందించిన ధ్రువ పత్రాలను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విచారించగా అవి తప్పుడు పత్రాలని తేలింది. దీంతో హైదరాబాద్ ప్రాంతీయ విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి ఆంజనేయులు నోటిసులిచ్చి సీజ్ చేశారు.