14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ : ఏబీవీపీ
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కాంగ్రెస్ సర్కార్ కుట్రలను నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కాంగ్రెస్ సర్కార్ కుట్రలను నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల స్థాయి వరకు అన్ని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. బంద్‌కు సహకరించి, కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు తిప్పికొట్టాలని ఆయన కోరారు.
10న విద్యాసంస్థల బంద్ : ఏఐవైఎఫ్
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10న కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని, దీనికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిందిపోయి ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నట్టు రేవంత్ సర్కార్ తీరు ఉన్నదని పేర్కొన్నారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

