బంజారాహిల్స్/ఖైరతాబాద్,ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ,ఖైరతాబాద్, సోమాజిగూడ. హిమాయత్‌నగర్ డివిజన్లనుంచి వచ్చిన కార్యకర్తలు ఉత్సాహంగా రక్తదానం చేశారు.
మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ రమేష్, తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కే.విప్లవ్‌కుమార్, కార్పొరేటర్లు వనం సంగీతాయాదవ్, కవితారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కాజా సూర్యనారాయణ, హేమలతాయాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి నర్సింగరావు, ప్రవీణ్‌కుమార్, రాములు చౌహాన్, విష్ణునాయక్, గోపాల్ నాయక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.