సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 9 : సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 17న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నెహ్రూ జూ పార్కు, పేట్లబుర్జు ప్రసూతి దవాఖాన, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ సిటీ కళాశాల, ఉస్మానియా దవాఖాన, ప్రభుత్వ డెంటల్ కళాశాల, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, పెన్షన్ పేమెంట్ ఆఫీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లను ఆయన సందర్శించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, సభ్యులు వైదిక్ శస్త్ర, బి శంకర్, యెట్టం సదానందం తదితరులు పాల్గొన్నారు.