
మెహిదీపట్నం నవంబర్ 11 : వినియోగదారులకు ‘రత్నదీప్ స్టోర్’ యాజమాన్యం ఉత్తమ సేవలందిస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. లంగర్‌హౌస్ ఫ్లోర్‌మిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రత్నదీప్ 130వ సూపర్‌మార్కెట్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, రత్నదీప్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ అగర్వాల్, డైరెక్టర్లు మనీష్ భారతీయ, మితేష్ భారతీయ, యష్ అగర్వాల్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రత్నదీప్ సంస్థ ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పెంచుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఇదే విధంగా విస్తరిస్తూ ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందించాలని తెలిపారు. మూడు రాష్ర్టాల్లో 130 సంస్థలను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.