
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): టైప్‌రైటింగ్ పరీక్షల నిర్వహణ కోసం టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కృషి మరువలేనిదని తెలంగాణ గుర్తింపుపొందిన టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్, కంప్యూటర్ అసోసియేషన్ (TRTS&CA) ప్రధాన కార్యదర్శి సతీశ్ బాలిగ అన్నారు. ఆయన చొరవతోనే రాష్ట్ర సాంకేతిక బోర్డు టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షల నిర్వహణకు బోర్డు కమిషనర్, కార్యదర్శి స్పందించి పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. బోర్డు నోటిఫికేషన్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 22, 23 తేదీల్లో టైప్‌రైటింగ్ పరీక్షలు, అదేవిధంగా 29, 30 తేదీల్లో షార్ట్‌హ్యాండ్ పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజు గడువు డిసెంబర్ 29 వరకు పొడిగించారని తెలిపారు. రూ.5వేలు చెల్లించి పరీక్షల ముందు రోజు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. టైప్‌రైటింగ్ శిక్షణ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషిచేస్తున్న అసోసియేషన్ చైర్మన్ మర్రి రాజశేఖర్‌రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.