
సికింద్రాబాద్ రీజియన్ నుంచి శబరిమలకు ప్రత్యేక సర్వీసులు
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ రీజియన్ నుంచి కేరళలోని శబరిమలకు శుక్రవారం నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్ఎం యుగంధర్ తెలిపారు. సికింద్రాబాద్ రీజియన్లోని 12 డిపోల నుంచి బస్ సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. బీహెచ్ఈఎల్, మియాపూర్-1, మియాపూర్-2, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, రాణిగంజ్-1, రాణిగంజ్-2, కంటోన్మెంట్, హకీంపేట్, కుషాయిగూడ, చెంగిచెర్ల డిపోల్లోని బస్సులను భక్తులు ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఒక బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99592 26154లో సంప్రదించాలని కోరారు.