Encounter | హర్యానాలో ఎన్కౌంటర్.. ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు హతం..!
Encounter | హర్యానా (Haryana) లో ఈ ఉదయం జరిగిన ఓ భారీ ఎన్కౌంటర్ (Encounter) లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు హతమయ్యారు. మరణించిన ఆ ఇద్దరిపై హర్యానా పోలీసులు (Haryana Police) తలా లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. బహదూర్గఢ్ (Bahadurgarh) లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్, హర్యానా 'స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)' సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
Encounter : హర్యానా (Haryana) లో ఈ ఉదయం జరిగిన ఓ భారీ ఎన్కౌంటర్ (Encounter) లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు హతమయ్యారు. మరణించిన ఆ ఇద్దరిపై హర్యానా పోలీసులు (Haryana Police) తలా లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. బహదూర్గఢ్ (Bahadurgarh) లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్, హర్యానా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)’ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ (Delhi Police Constable) ఒకరికి గాయాలయ్యాయి.
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారి ప్రమోద్ కుష్వా ఈ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. నిందితులను హిసార్‌కు చెందిన ప్రవేశ్, జఖోద్ ఖేరా గ్రామానికి చెందిన హిమాన్షుగా గుర్తించినట్టు తెలిపారు. వీరు లారెన్స్ బిష్ణోయ్-హరిరామ్ అలియాస్ హ్యారీ బాక్సర్-అనిల్ పండిట్ క్రైమ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, పలు కేసుల్లో పరారీలో ఉన్నారని చెప్పారు. జూన్ 11న హన్సీలో కపిల్ అనే జిమ్ ఆపరేటర్‌ను పట్టపగలే దారుణంగా హత్య చేసిన కేసులో వీరు ప్రధాన నిందితులుగా ఉన్నారు.
ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. మరో తీవ్రమైన నేరానికి పాల్పడేందుకు నిందితులు ఆయుధాలతో బహదూర్గఢ్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్, హర్యానా ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా వారిని ట్రాక్ చేసి చుట్టుముట్టాయి. లొంగిపోవాలని కోరగా నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని హర్యానా ఎస్టీఎఫ్ ఎస్పీ విక్రాంత్ భూషణ్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులతోపాటు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కు చెందిన కానిస్టేబుల్ అంకిత్ కాలికి బుల్లెట్ గాయమైంది. గాయపడిన ముగ్గురినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నిందితులిద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కానిస్టేబుల్ అంకిత్ చికిత్స పొందుతున్నారని, అతనికి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై బహదూర్గఢ్ సదర్ పోలీస్ స్టేషన్లో కొత్త కేసు నమోదు చేసి, చట్టపరమైన విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

