The Greatest Trailer | బాక్సింగ్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం మొహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ వెబ్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’ (The Greatest). ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది.
హాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘క్రీడ్’ చిత్రాల ఫేమ్ మైఖేల్ బి. జోర్డాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్, నవంబర్ 4న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య లోనీ అలీ అధికారిక అనుమతితో రూపొందుతున్న మొట్టమొదటి స్క్రిప్టెడ్ సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‌లో అలీ (కాసియస్ క్లే) ప్రధాన పాత్రను యువ నటుడు జాలెన్ బెస్ట్ పోషిస్తుండగా, మైఖేల్ ఈలీ (మాల్కం ఎక్స్ పాత్రలో), ఒమారి హార్డ్‌విక్, అమిన్ జోసెఫ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్ వాట్కిన్స్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్ కేవలం బాక్సింగ్ రింగ్‌లోని విజయాలనే కాకుండా, 1960లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించినప్పటి నుండి 1964లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా ఎదిగే వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక పోరాటాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది.