ఐపీఎల్ 2025కి సంబంధించిన మ్యాచ్ టికెట్లన్ని అమ్ముడుపోయాయని.. క్రికెట్ అసోసియేషన్ నిర్వాహాకులు బ్లాక్‌లో అమ్ముకోవడం వలనే ఇలా జరిగిందంటూ మీడియా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు (హెచ్‌సీఏ) అర్శనపల్లి జగన్మోహన్ రావు స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో.. ముంబైలో జరిగే మ్యాచ్‌కు టిక్కెట్లు అమ్ముడుపోతే హెచ్‌సీఏకు ఏం సంబంధం అంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ మ్యాచ్ టిక్కెట్లను విక్రయించేది బుక్‌మై షోలో కాదని.. జొమాటోకి చెందిన డిస్ట్రిక్ యాప్(District by Zomato)లో అని తెలిపాడు. సన్‌రైజర్స్ ఆడే తొలి రెండు మ్యాచ్‌ల టిక్కెట్లు ఇప్పటికే డిస్ట్రిక్ యాప్ (District)లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టికెట్ల విషయంలో మిడిమిడి జ్ఞానం, సమాచారంతో వార్తలు ప్రసారం చేసి అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని వెల్లడించారు.
అలాగే ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లపై అధికారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది ఉంటుందని హెచ్‌సీఏ ఉండదని.. బీసీసీఐ, హెచ్‌సీఏ ఐపీఎల్ ఏర్పాట్లను పరిశీలిస్తుంది కానీ టిక్కెట్లు విక్రయించదని తెలిపాడు. ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రతిష్ఠను మసకబారిస్తే ఉపేక్షించేది లేదు. దేశంలోనే హెచ్‌సీఏను ఒక రోల్ మోడల్‌గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఐపీఎల్ టిక్కెట్ల దందా అని హెచ్‌సీఏపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన చానెళ్లకు లీగల్ నోటీసులిస్తాం. కొందరిచ్చే తప్పుడు సమాచారంతో హెచ్‌సీఏపై బురదజల్లితే న్యాయపరంగా చర్యలు తీసుకొంటాం అంటూ జగన్ మోహన్ వార్నింగ్ ఇచ్చాడు.
టీటీడీ విడుదల చేసే రూ.300ల టిక్కెట్లు వెంటనే అయిపోతే ఇలానే వ్యవహరిస్తారా?. తక్కువ ధర టిక్కెట్లను విద్యార్థులు, యువతలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి అవి త్వరగా విక్రయమవుతాయి. చివరగా టిక్కెట్ల విషయమై ఏమైనా అనుమానులుంటే సన్ రైజర్స్ యాజమాన్యం, సిబ్బంది, డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ ప్రతినిధులను సంప్రదించిండంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు మీడియా ద్వారా చెప్పుకోచ్చాడు.