తిరుమల : హైదరాబాద్కుచెందిన ఏడీవో ( ADO Foundation) ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ సోమవారం టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా( Donations ) అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి . టోకెన్లు లేని భక్తులకు 12 నుంచి 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,424 మంది భక్తులు దర్శించుకోగా 27,872 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.06 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు . తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు.