తిరానా: భార్యతో విసుగుచెందిన ఓ భర్త.. ఇంటికంటే జైలే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన అల్బేనియాలో ఇటీవల చోటుచేసుకున్నది. 30 ఏండ్ల వివాహితుడైన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో దోషిగా తేలాడు. అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు అతన్ని గృహనిర్బంధం చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భార్యతో అతనికి పడేది కాదు. చీటికీమాటికి ఏవో గొడవలు. వీటి నుంచి తప్పించుకొని బయటకు వెళ్దామంటే పోలీసుల ఆంక్షలు. దీంతో విసిగిపోయిన ఆ భర్త.. తనను ఇంటి నుంచి జైలుకు తరలించాలని పోలీసులకు ప్రాధేయ పడ్డాడు. చేసేదేమీలేక.. నిబంధనలు ఉల్లంఘించాడన్న సాకుతో అధికారులు అతన్ని జైలుకు తరలించారు.