వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2’కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. దిల్ రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్, తమన్నా నాయికలు. రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మొత్తం కుటుంబ సభ్యులు, మిత్రులంతా ఈ పోస్టర్లో నవ్వుల హంగామా సృష్టిస్తున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా మే 27న విడుదల కానుంది.