Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Manne Krishank | ఎవరో ఢిల్లీలోని యూత్‌కాంగ్రెస్ లీడర్ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేస్తే ఈ కాంగ్రెస్ గుండాలంతా కలిసి కేసీఆర్ హయాంలో గచ్చిబౌలిలో స్థాపించిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెటా క్యాంపస్‌పై దాడి చేస్తారని మండిపడ్డారు.
Manne Krishank | గచ్చిబౌలిలోని ఫేస్బుక్ మెటా ఆఫీస్ మీద దాడి చేసి యూత్ కాంగ్రెస్ నాయకులు బీభత్సం సృష్టించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిన్న గచ్చిబౌలిలోని ఫేస్ బుక్ మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వారం ముందే ఇక్కడికొచ్చి సహనం గురించి, రాజ్యాంగం గురించి , ప్రజస్వామ్యం గురించి ప్రపంచంలోని ఎవరెవరినో విదేశాల నుంచి ఇక్కడితీసుకొచ్చి.. అందరితో ప్రవచనాలు చెప్పించి రాహుల్ గాంధీ చేసిందేమిటి.. ? అనిప్రశ్నించారు.
ఎవరో ఢిల్లీలోని యూత్‌కాంగ్రెస్ లీడర్ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేస్తే ఈ కాంగ్రెస్ గుండాలంతా కలిసి కేసీఆర్ హయాంలో గచ్చిబౌలిలో స్థాపించిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెటా క్యాంపస్‌పై దాడి చేస్తారని మండిపడ్డారు. మీరు మహిళా జర్నలిస్టులను జైలులోవేస్తరు.. రాత్రి తీసుకెళ్లి వాళ్లను అరెస్ట్ చేస్తరు.. కకేవలం యూ ట్యూబ్‌లో బీఆర్ ఎస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను వేసినందుకు కూడా 2 నెలల పాప ఉంటే కూడా నోటీసులు ఇచ్చి రేఖా అనే జర్నలిస్టును తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తరు.. ఫోన్లు లాక్కుంటరు.. రీట్వీట్స్ చేసినందుకు కేసులు వేస్తరు.. అరెస్ట్ చేస్తరు.. జైలుకు పంపిస్తరని ఫైర్ అయ్యారు..
మరి ఒక న్యూస్ హ్యాండిల్ తెలుగు స్క్రైబ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా అకౌంట్లను బ్లాక్ చేస్తే మేము కోర్టుకు పోతున్నామన్నారు. ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి, ఇన్వెస్టర్లు ఎక్కడి నుండి వస్తారని మన్నె క్రిశాంక్ అడిగారు.
నిన్న గచ్చిబౌలిలోని మెటా కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం దారుణం
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెటా క్యాంపస్‌ను కేసీఆర్ హయాంలో గచ్చిబౌలిలో స్థాపించారు
ఎవరో ఢిల్లీలోని నాయకుల సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేస్తే ఈ కాంగ్రెస్ గుండాలు మన హైదరాబాద్‌లో మెటా ఆఫీసుపై దాడి చేశారు
మరి తెలుగు స్క్రైబ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ చేసింది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా అకౌంట్లను బ్లాక్ చేస్తే మేము కోర్టుకు పోతున్నాం
అదే ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడి అకౌంట్ బ్లాక్ అయితే ఇక్కడ మన హైదరాబాద్‌లో కంపెనీపై ఈ కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నారు
ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి, ఇన్వెస్టర్లు ఎక్కడి నుండి వస్తారు
– బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2026
Read Also :
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Phule Movie | తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్!
Plastic Bottle | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను మళ్లీమళ్లీ వాడుతున్నారా.. వాటిపై టాయిలెట్ కుండీల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట..!
Nuvvu Rammante | శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా ‘నువ్వు రమ్మంటే’ ఫోక్ సాంగ్ విడుదల!
YS Jagan | ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా ఉంటా : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

