HomeNewsHousehold Tips Take These Care While Using Nonstick Cookware
Non Stick Pan | నాన్‌స్టిక్ గిన్నెలు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మీకోసమే
నాన్‌స్టిక్ పాత్రలు కొన్న సమయంలో వాటిపై ఒక స్టిక్కర్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్ పీకేస్తే మొత్తం రాదు. కొద్దిగా ఆ గిన్నెకే అతుక్కుపోతుంది. అందుకే స్టిక్కర్ పీకేసే ముందు స్టవ్‌పై పెట్టి కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత స్టిక్కర్‌ను పీకేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత వేడి నీళ్లతో శుభ్రం చేసి ఆరబెట్టాలి.
2/9
నాన్‌స్టిక్ పాత్రలపై వంట చేయడం సులువు. ఒకసారి వండిన తర్వాత వాటిని కడగడం కూడా ఈజీనే. అందుకే చాలామంది మహిళలు నాన్‌స్టిక్ పాత్రనే వాడతారు. అయితే మామూలు పాత్రల్లా వీటిని ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్రం త్వరగా పాడైపోతాయి. వాటిపై ఉండే టెప్లాన్ కోటింగ్ పోయి పనికి రాకుండా పోతాయి. అందుకే నాన్‌స్టిక్ పాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఆ జాగ్రత్తలు ఏంటంటే..
3/9
నాన్‌స్టిక్ పాత్రలను సన్నటి మంటపై మాత్రమే ఉంచాలి. ఎక్కువ మంటపై పెడితే ఆ వేడికి నాన్‌స్టిక్ పాత్రలపై ఉన్న టెప్లాన్ కోటింగ్ పోతుంది. ఎంత తక్కువ మంటపై వీటిని ఉపయోగిస్తే అంత మంచిది.
4/9
నాన్‌స్టిక్ పాత్రలను డైరెక్ట్ స్టవ్‌పై పెట్టి అలాగే ఉంచొద్దు. స్టవ్‌పై పెట్టే ముందు లేదా పెట్టిన వెంటనే కొద్దిగా నూనె పోయాలి.
5/9
ప్రతి వంటకానికి నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించకూడదు. ఏవైనా అతుక్కుపోయే కూరలు లేదా ఫ్రై కర్రీలు చేసినప్పుడే వీటిని వాడాలి. తద్వారా ఎక్కువ కాలం మన్నుతాయి.
6/9
కూర వండేటప్పుడు కలపడానికి ప్లాస్టిక్, చెక్క గరిటెలను మాత్రమే ఉపయోగించాలి. ఐరన్, స్టీల్, ఇత్తడి, సిల్వర్ వంటి గరిటెలను వాడకూడదు. వీటిని వాడితే గిన్నెపై గీతలు పడే అవకాశం ఉంది.
7/9
నాన్‌స్టిక్ పాత్రలను తోమేటప్పుడు గరుకుగా ఉండే పీచు ఉపయోగించవద్దు. అలాగే జిడ్డు మరకలు పోవాలని గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల గిన్నెలపై కోటింగ్ పోయే అవకాశం ఉంది.
8/9
గిన్నెలకు గట్టిగా అంటుకున్న పదార్థాలు పోవాలని చెంచా, చాకులతో గీకకూడదు. అలా చేస్తే గిన్నెలపై గీతలు పడి తొందరగా పాడవుతాయి. గిన్నెలో నీళ్లు పోసి చాలాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత రుద్ది కడిగితే సులువుగా శుభ్రమవుతాయి.
9/9
నాన్‌స్టిక్ పాత్రలను వంటింట్లోని సెల్ఫ్‌లు లేదా అల్మారాలో పెట్టినప్పుడు గీతలు పడే ప్రమాదం ఉంది. అందుకే వాటిని సెల్ఫ్‌లో కాకుండా, గిన్నెలు పెట్టుకునే స్టాండ్‌లో పెట్టడమే మంచిది. దీనివల్ల గిన్నెలు ఎక్కువకాలం మన్నుతాయి.
10/9
నాన్‌స్టిక్ పాత్రలను వాడిన తర్వాత శుభ్రం చేసి, మెత్తటి పొడి బట్టతో తుడిచి భద్రపరచాలి. దీనివల్ల గిన్నెలు ఎక్కువ కాలం కొత్తవిగా, పాడవ్వకుండా ఉంటాయి.