కప్‌బోర్డుల్లో, కిచెన్ కేబినెట్ల కింద కొన్నిసార్లు ఏదైనా లైట్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేకాదు.. రీడింగ్ టేబుల్ పైన సరైన లైటింగ్ లేకపోతే చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పలు అవసరాలకు తగిన లైట్ ఒకటి ఉంది. దాన్ని వాడితే కళ్లకు ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు.. త్వరగా అలసిపోరు. సాధారణ ట్యూబ్ లైట్‌ను ఫిట్ చేయాలంటే కరెంట్ వైరింగ్, పెద్ద సెటప్ అవసరం. కానీ, దానికి స్మార్ట్ సొల్యూషన్.. ఈ Hoteon LED. ఈ అండర్ కేబినెట్ లైట్‌కి అవేం అక్కర్లేదు. ఇది కేవలం యూఎస్బీ ద్వారా పనిచేసే పోర్టబుల్ లైట్. ఫ్లికర్ ఫ్రీ లైటింగ్ వల్ల కళ్లకు ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు. రాత్రిపూట చదువుకోవడానికి, కిచెన్‌లో పనులు చేయడానికి ఇది బెస్ట్ డీల్. దీన్ని ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్ చార్జర్‌కి, పవర్ బ్యాంక్‌కి కూడా కనెక్ట్ చేయొచ్చు.
ధర: రూ. 700
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ఎక్కువసేపు చదువుతున్నప్పుడు లేదా ట్యాబ్, ఫోన్‌తో పనిచేస్తున్నప్పుడు మెడ నొప్పి వస్తున్నదా? అంతేకాదు.. పుస్తకాన్ని కింద పెట్టి చదవడం వల్ల కళ్లు, వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి పడుతున్నదా? ఎక్కువసేపు చదవడానికి, ఏకాగ్రత పెట్టడానికి కష్టంగా అనిపిస్తున్నదా? ఈ సమస్యలన్నిటికీ సింపుల్, హెల్దీ సొల్యూషన్.. ఈ ELV Direct బుక్ హోల్డర్ స్టాండ్. ఇది మీ పుస్తకాన్ని కంటి లెవెల్‌కి ఎత్తి పట్టుకుంటుంది. దీంతో బుక్ రీడింగ్ మరింత ఈజీ, కంఫర్టబుల్ అవుతుంది. మీరు కిందికి వంగాల్సిన అవసరం ఉండదు. మీ వెన్నెముకపై ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. స్టాండ్‌కు పేజీ హోల్డర్స్ ఉన్నాయి. దీంతో పుస్తకాన్ని మీరు చేతులతో పట్టుకోవాల్సిన పని లేదు. గాలికి పేజీలు కూడా ఎగిరిపోతాయనే కంగారు అక్కర్లేదు. ఏదైనా వంట చేసేటప్పుడు రెసిపీ బుక్‌ను స్టాండ్‌కి పెట్టేయొచ్చు. చూస్తూ.. చదువుతూ.. హాయిగా వంట చేయొచ్చు. ఇది ఏ4 సైజ్‌లో ఉంటుంది. స్కూలు, ఇల్లు, ఆఫీస్, కిచెన్.. ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. లైట్‌వెయిట్‌గా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా క్యారీ చేయొచ్చు. ఇది హై గ్రేడ్ ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ కూడా. స్టూడెంట్స్‌కి, పుస్తకాలు ఇష్టపడే ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్.
ధర: రూ. 500
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

రాత్రి పడుకున్నా, లేదా చదువుతున్నా చుట్టూ ఉన్న అనవసరమైన శబ్దాలతో ఏకాగ్రత కష్టమవుతున్నదా? ఏదైనా కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నా, ట్రాఫిక్ సౌండ్ ఉన్నా.. ఇబ్బందిగా అనిపిస్తున్నదా? దీనికి సింపుల్ సొల్యూషన్ ఈ 3M 1110 ఇయర్‌ప్లగ్స్. ఇవి చాలా ఎక్స్ట్రా సాఫ్ట్‌గా, రీ యూజబుల్‌గా ఉంటాయి. దీన్ని ఉపయోగించి మీరు 29 డెసిబిల్స్ వరకు శబ్దాన్ని తగ్గించుకోవచ్చు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు వాడుకోవచ్చు. ప్లగ్స్ ఉపరితలం స్మూత్‌గా, డర్ట్-రెసిస్టెంట్‌గా ఉంటుంది. వీటిని ఫోమ్‌తో తయారు చేశారు. హైపో అలెర్జెనిక్ మెటీరియల్ కూడా. దీంతో చెవులకు ఇన్ఫెక్షన్లు రావు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా ధైర్యంగా వాడుకోవచ్చు. వీటిని రోల్ చేస్తూ చెవిలో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా అవసరం వచ్చిన వెంటనే జేబులోంచి తీసి పెట్టుకోవచ్చు.
ధర: రూ. 250
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

పనిచేసే లేదా చదువుకునే టేబుల్‌పై పెన్నులు, కత్తెరలు, ఫోన్, కళ్లద్దాలు.. అన్నీ చెల్లాచెదురుగా ఉంటున్నాయా? ముఖ్యంగా రోజూ ఆఫీస్‌కి తీసుకెళ్లే మాస్క్, కీచైన్, ఇయర్‌ఫోన్స్ ఎక్కడ పెట్టారో తెలియక ఫ్రస్ట్రేషన్‌కి గురవుతున్నారా? అయితే.. ఈ సమస్యలకు చెక్ పెట్టే స్మార్ట్ సొల్యూషన్.. eo Pen Stand (డెస్క్ స్టేషన్). ఇది కేవలం పెన్ స్టాండ్ మాత్రమే కాదు. ఒక మల్టీ-ఫంక్షనల్ ఆర్గనైజర్. ఇదో ఆల్-ఇన్-వన్ స్టోరేజ్ డెస్క్. పెన్నులు, పెన్సిల్స్, హైలైటర్స్ని ఒకచోట ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్, కళ్లద్దాలు, సన్ గ్లాసెస్‌ను కూడా ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు. ఇందులో సెల్ఫ్-వాటరింగ్ ప్లాంటర్ కూడా వస్తుంది. దీంతో ఇండోర్ ప్లాంట్స్‌ని సులభంగా పెంచొచ్చు. కళ్లద్దాలు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన డాక్ ఉంది. మీ కళ్లద్దాలపై గీతలు పడకుండా ఉంటాయి. హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. దీనికి ఉన్న అదనపు ఆరమ్స్కి కీచైన్, మాస్క్‌లను తగిలించుకోవచ్చు. బయటికి వెళ్లేటప్పుడు వెతుక్కోవాల్సిన పని ఉండదు.
ధర: రూ. 800
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్