మంచిర్యాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. లారీ , ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి ( Four persons Died ) చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నస్పూర్ మండల కేంద్రంలో కూలీలతో బయలుదేరని ఆటో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. మృతులు మందమర్ని మండలం పొన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటాపూర్‌కు చెందిన అగ్గు సౌందర్య, సోనియా , సుమలతగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, ఏసీపి ప్రకాష్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను సిపి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి గడ్డం వివేక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరంతా తన నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో వృద్ధుల కుటుంబాలకు తక్షణసాయంగా 25 వేలు, గాయపడ్డ వరకు 10వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు.