బంజారాహిల్స్, నవంబర్ 25: కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, జీవన శైలిని గుర్తుకు తెస్తూ ప్రముఖ చిత్రకారుడు చిలువేరు మనోహర్ ‘హోప్ కాస్మోస్’ పేరుతో పెయింటింగ్ ప్రదర్శనను జూబ్లీహిల్స్‌లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ డైరెక్టర్, సామాజికవేత్త సుధారెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించగా నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి తదితరులు తిలకించారు. మనోహర్ వేసిన పెయింటింగ్స్‌ను తిలకించడంతో పాటు తమలోని కళను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినట్లు, ఎవరైనా వచ్చి పెయింటింగ్స్ వేయవచ్చని చిత్రకారుడు మనోహర్ తెలిపారు. వర్థమాన చిత్రకారులను ప్రోత్సహించేందుకు అవసరమయ్యే సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.