e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఈశ్వరయ్య.. నువ్వు దేవుడవయ్య..

ఈశ్వరయ్య.. నువ్వు దేవుడవయ్య..

ఈశ్వరయ్య.. నువ్వు దేవుడవయ్య..
  • ఆరుగురికి పునర్జన్మనిచ్చిన హోంగార్డు
  • ఆత్మహత్మకు యత్నించిన వారిని కాపాడి.. కౌన్సెలింగ్‌
  • సైదాబాద్‌ ఘటనలో సాహసానికి ప్రశంసలు
  • ప్రధాన మంత్రి లైఫ్‌సేవింగ్‌ అవార్డుకు సిఫార్సు

ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే కోరికతో పోలీసు ఉద్యోగం చేయాలనుకున్నా..ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు.. దీంతో ఊరిలో బర్లను కాస్తూ.. బట్టలు కుట్టే పని చేశాడు.. అయితే.. పోలీస్‌ ఉద్యోగంపై ఉన్న ప్రేమతో 2000లో హోంగార్డుగా విధుల్లో చేరాడు. ఇలా.. 21 ఏండ్లపాటు హోంగార్డుగా పనిచేసిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పెండ్యాల గ్రామానికి చెందిన ఈశ్వరయ్య.. విధులను నిబద్ధతో, నిజాయితీగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలను పొందాడు.
ఎక్కడ విధులు నిర్వహించినా పేదవారు, ఆకలితో అలమటించే వారు ఎవరైనా సరే.. వారికి భోజనం, అల్ఫాహారం, ఇతర తినుబండరాలను అందించి ఆదుకున్నాడు. అలాగే చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించినవారిని కాపాడారు.. ఇలా అతని సేవలు గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారులు అతనికి ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ అవార్డు కోసం సిఫార్సు చేశారు.

ఆరుగురిని కాపాడాడు…

  • ఈశ్వరయ్య.. కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర పోలీసు స్టేషన్‌లలో విధులు నిర్వహించాడు.
  • గత యేడాది సరూర్‌నగర్‌ చెరువు వద్ద విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. వివిధ కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఐదుగురిని కాపాడి.. సమస్యను ధైర్యంగా ఎదురించాలని.. ఆత్మహత్య చేసుకోవద్దని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చాడు.
  • తాజాగా శుక్రవారం సైదాబాద్‌కు శివకుమార్‌ ప్రేమ విఫలమై సరూర్‌నగర్‌ చెరువులో దూకాడు.
  • అక్కడే విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య గమనించి వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చి.. నీళ్లలోకి దూకి అతడిని కాపాడి పైకి తీసుకొచ్చాడు.
  • ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అందరూ అతను చేసిన పనిపై ప్రశంసలు కురిపించారు.
  • దీంతో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఈ వీడియోను ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేసి.. ఈశ్వరయ్య చేసిన సాహసానికి అతనికి ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ అవార్డు కోసం సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు.
  • శనివారం ఎల్బీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో సీపీ అతన్ని ఘనంగా సత్కరించి.. రివార్డును అందించారు.
  • కార్యక్రమంలో ఎల్బీనగర్‌ డీసీపీ సంప్రీత్‌ సింగ్‌ పాల్గొన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈశ్వరయ్య.. నువ్వు దేవుడవయ్య..

ట్రెండింగ్‌

Advertisement