Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Holidays | అర్నబ్ తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు అధికారులు సెలవు ప్రకటించారు.
అమరావతి : అర్నబ్ తుపాను ( Cyclone Arnab ) ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు అధికారులు సెలవు (Holidays ) ప్రకటించారు. ఈనెల 27,28 వ తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ప్రకటించారు. విశాఖ, కృష్ణా , కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలకు మంగళ, బుధవారం సెలవు ప్రకటించారు.
తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. తుపాను గమనం అంచనా వేసి ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని, రైతులు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని, తీరప్రాంత ప్రజలను షెల్టర్లకు తరలించాలని కలెక్టర్లకు ఆదేశించారు.తుపాను ప్రభావిత జిల్లాలకు ముందస్తు చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

