ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబురాన్నంటాయి.. శుక్రవారం పల్లె, పట్నం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల పండుగ చేసుకున్నారు.. మహిళలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాలు పంచుకున్నారు.. చిన్నారులు ఆట బొమ్మల్లో నీళ్లు, రంగులు నింపుకొని చల్లుకున్నారు.. పిల్లల కేరింతలు.. బ్యాండ్ మేళాల మధ్య యువతీయువకులు.
రహదారులన్నీ రంగులతో నిండిపోయాయి.. చిన్నారులు ఆయా కాలనీల్లోని కూడళ్లలో నీటి డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని ఉవ్వెత్తున ఉత్సాహంతో ఉట్లు కొడుతూ సంబురం చేసుకున్నారు..