HK Clinic | హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సౌందర్య చికిత్స కేంద్రం HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ మరియు HK హాస్పిటల్స్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి పన్నిన డిజిటల్ కుట్రపై తెలంగాణ హైకోర్టు, సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. తప్పుడు సమాచారం మరియు దుష్ప్రచారం చేసిన పలువురు యూట్యూబర్లు, వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. 2025 జూన్‌లో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో నమోదైన FIR నంబర్ 692/2025 ఆధారంగా పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో హెచ్‌కే గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా డిజిటల్ కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించారు. దర్యాప్తులో లభించిన కాల్ రికార్డులు, ఆన్లైన్ కమ్యూనికేషన్లతో కూడిన డిజిటల్ సాక్ష్యాలు ఈ కుట్రను స్పష్టం చేశాయి.
కుట్రలో పాల్గొన్న నిందితులు:
దర్యాప్తులో ప్రధాన నిందితురాలిగా వెల్నెస్ ఆఫ్ విమెన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్ పూర్ణిమ పిన్నేటి (A1) గుర్తించబడింది. ఆమెతో పాటు ఈ కుట్రలో భాగమైన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వీరే:
శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65
ఆనంద్ లవేటి (విజయవాడ)
పవన్ కుమార్ అలియాస్ పవన్ రా టాక్స్
అరుణ్ గున్నా అలియాస్ జాంబీ రివోల్ట్
పవని మహేష్ అలియాస్ MC టాక్స్
జర్నలిస్ట్ పట్రిషియా నాయుడు
వీరంతా A1 సూచనల మేరకు హెచ్‌కే గ్రూప్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. హెచ్‌కే గ్రూప్‌పై తప్పుడు ప్రచారం చేయడానికి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో స్పష్టంగా తేలింది. నిందితులపై భారతీయ న్యాయ సన్హిత (BNS) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశాము అని తెలిపారు.
హైకోర్టు చరిత్రాత్మక ఆదేశాలు:
ఈ పోలీస్ దర్యాప్తుకు సమాంతరంగా హెచ్‌కే గ్రూప్ మరియు డైరెక్టర్ శ్రీమతి అజ్మీరా హర్షిత నాయక్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (నం. 15451/2025) పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హైకోర్టు జూన్ 12, 2025న, యూట్యూబ్ ఇండియా మరియు మెటా ప్లాట్ఫార్మ్స్ (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) లకు సంబంధిత 100 కంటే ఎక్కువ అపకీర్తి వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
న్యాయ నిపుణుల అభిప్రాయం:
చట్ట నిపుణులు ఈ తీర్పును డిజిటల్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చరిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. హెచ్‌కే గ్రూప్ తరఫు న్యాయవాది నాగూర్‌బాబు మాట్లాడుతూ, ఇది డిజిటల్ అపకీర్తి బారిన పడిన ప్రతి చట్టబద్ధ సంస్థకు ఒక దిశా నిర్దేశక తీర్పు. సోషల్ మీడియా చట్టానికి అతీతం కాదని హైకోర్టు బలంగా తెలియజేసింది. నిజం ఎప్పటికీ గెలుస్తుంది అన్నారు.
HK గ్రూప్ ప్రతిష్ఠ పునరుద్ధరణ:
హైకోర్టు తీర్పుతో హెచ్‌కే గ్రూప్ ప్రతిష్ఠ పునరుద్ధరించబడింది. కోర్టు హెచ్‌కే గ్రూప్‌కు ఉన్న లైసెన్సులు, చట్టబద్ధతను ధృవీకరించింది. హానరరీ అడ్వైజర్ డా. జి. నరసింహ రావు నేత, “మాపై కుట్ర పన్నినప్పటికీ, న్యాయవ్యవస్థ, పోలీసులు వేగంగా స్పందించారు. హెచ్‌కే గ్రూప్ ఎఫ్డిఏ (FDA) మరియు సీడీఎస్సీఓ (CDSCO) ఆమోదించిన ఆధునిక టెక్నాలజీలు, కన్స్యూమబుల్స్ను మాత్రమే ఉపయోగిస్తోంది” అని తెలిపారు. డైరెక్టర్ శ్రీమతి అజ్మీరా హర్షిత నాయక్ మరియు శ్రీ కార్తీక్ ఈ సందర్భంగా తమ క్లయింట్లు, సిబ్బంది, లీగల్ టీమ్ మరియు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హెచ్‌కే గ్రూప్ సోషల్ మీడియా వినియోగదారులకు, ఇన్ఫ్లూయెన్సర్లకు విజ్ఞప్తి చేస్తూ “తప్పుడు సమాచారం లేదా లైసెన్స్ పొందిన సంస్థలపై అపకీర్తి కంటెంట్ ప్రచారం చేయడం భారత చట్టం ప్రకారం నేరం” అని హెచ్చరించింది.