కాలానికి లోబడని కాళోజీ

కాళోజీ.. ప్రజా కవీ…
మీ కైతలు కెంపుల పూలై
పరిమళాలను వెదజల్లుతున్న వేళ
మీ జ్ఞాపకాల తోరణాన్ని
మేం ఇంటింటికీ కట్టుకుంటున్నం
కాలానికి లోబడని
మీ తెరిచిన జీవిత పుస్తకాన్ని
మనసారా చదువుకుంటున్నం
నానా భావనల అక్షరాల జీవనదిలో
మునకలేస్తూ పునీతులమవుతున్నం
నిక్కచ్చితనానికి నిలువెత్తు సాక్ష్యం అయిన
మిమ్మల్ని తలచుకుంటూ తరిస్తున్నం
మీ మానవతావాదాన్ని
మా ముచ్చట్లలో కలబోసుకుంటున్నం
అంతా మీవాళ్ళే అనుకున్న మీ ఆర్తిని
మా గుండెల్లో పదిలపరచుకుంటున్నం
అన్యాయాన్ని సహించలేని నెగళ్ళ ఆ కళ్ళు
ఎప్పటికీ మా కండ్లముందే కదలాడుతుంటయ్
మనిషిని మనిషిగా చూడాలన్న మీ ఆకాంక్షను
మా ఆలోచనలకు పునాది చేసుకుంటున్నం
చెమ్మగిల్లని కళ్ళు బతుకు కమ్మదనము
చూడలేవన్న మీ అక్షర సత్యాలను
మా జీవితాలకు అన్వయించుకుంటున్నం
అరాజకాలపై ప్రశ్నాస్ర్తాలను సంధించే
మీ కలం, గళం మాకాదర్శం
మమతయున్న మనిషిలోన
సమతాభావము కలుగునన్న
మీ సందేశం మాకు సదా అనుసరణీయం
పలుకుబడుల భాష
తెలంగాణ ప్రజల జీవద్భాష అన్న
మీ భాషా సంపదను మేం సొంతం చేసుకుంటున్నం
అన్యాయాన్నెదిరించెటోడే మాకారాధ్యుడన్న
మిమ్మల్ని మేమెప్పటికీ ఆరాధిస్తూనే ఉంటం
ఆత్మగౌరవంతో కూడిన మీ ధిక్కార స్వరానికి
మేమంతా తలలు వంచి సలాం చేస్తున్నం
‘నా గొడవ’ యన్న మీ గొడవను మా గొడవగా చేసుకొని
పరివర్తన కోసం పరిశ్రమించబూనుతాం
మీరు చూపించిన బాటలో నడుస్తూ
బాధ్యతలను నిర్వర్తిస్తూ.. మీ యాదిలో జీవిస్తూ..
హక్కుల సాధనలో విజయం సాధించితీరుతాం..
డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
98492 34725
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

