హనుమకొండ : హనుమకొండ అశోకా హోటల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను అరెస్టు చేసేందుకు భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అశోకా హోటల్‌కు చేరుకున్నారు. కుడా భూములను ఆన్లైన్ టెండర్లు పెట్టకుండా ఆఫ్‌లైన్‌లో పెట్టారని, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకట్రాం రెడ్డి మనుషులు బెదిరింపులకు పాల్పడుతున్నా వినయ్ భాస్కర్ ఆరోపించారు.
అవినీతిలో ఇద్దరికి భాగస్వామ్య ఉందని పేర్కొన్నారు. వెంటనే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పక్ష నేతల గొంతు నొక్కుతుందని మండిపడ్డారు. వరంగల్ నగరంలో పేదల ఇళ్లు కుల్చుతున్నారు. పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. ప్రజల కోసం దేనికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.