Ayatollah Ali Khamenei: మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ శవపేటిక తరలింపు
Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ.. పార్దీవదేహానికి అధికారిక అంత్యక్రియల ప్రక్రియ ఈ శుక్రవారం ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో ఖమేనీ పార్దీవదేహం ఉన్న శవపేటికను .. ముందుగా ఆయన మరణించిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఇరానీ మీడియా పేర్కొన్నది. ఆ తర్వాత నగరంలోని మోసల్లా మసీదుకు ఆ శవపేటికను తరలించారు. ప్రపంచ నేతలు అక్కడ నివాళ్లు అర్పించనున్నారు.
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei).. అమెరికా దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్దీవదేహానికి అధికారిక అంత్యక్రియల ప్రక్రియ ఈ శుక్రవారం ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో ఖమేనీ పార్దీవదేహం ఉన్న శవపేటికను .. ఆయన మరణించిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఇరానీ మీడియా పేర్కొన్నది. ఆ తర్వాత నగరంలోని మోసల్లా మసీదుకు తరలించారు. ఇక జూలై 4,5వ తేదీల్లో రాజధాని టెహ్రాన్‌లో అయతుల్లా ఖమేనీకి చివరి నివాళి అర్పించనున్నారు. సుమారు రెండు కోట్ల మంది ప్రజలు తుది వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయతుల్లా ఖమేనీ సమాధి నేపథ్యంలో వారం రోజుల పాటు అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించనున్నారు. దీని కోసం ఇస్లామిక్ మత పెద్దలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం ఖామ్, మాషాద్ నగరాల్లో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేశారు.
A delegation of Indian religious leaders paid tribute to the martyred Leader of the Islamic Republic of Iran, Ayatollah Ali Khamenei. pic.twitter.com/Ji1i3vNkGm
— Iran in India (@Iran_in_India) July 3, 2026
అయతుల్లా ఖమేనీ శవపేటికను ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్న గ్రాండ్ మోసల్లా మసీదులో ఉంచారు. శుక్రవారం ఇక్కడే ప్రార్థనలు నిర్వహించనున్నారు. అయితే శనివారం జరిగే ప్రార్థనల్లో పాల్గొనేందుకు విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిసింది. గ్రాండ్ మోసల్లా మసీదుకు తీసుకెళ్తున్న శవపేటికపై ఇరాన్ జాతీయ త్రివర్ణ జెండాను కప్పారు. ప్రస్తుతం ఇరాన్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎండలు దంచికొడుతున్నాయి. హీట్‌వేవ్ నేపథ్యంలో ప్రతినిధులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పాకిస్థాన్ మీడియేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే అంత్యక్రియల కోసం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరుకానున్నారు. చైనా, ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు కూడా రానున్నారు.
Congress leader Salman Khurshid and PDP chief Mehbooba Mufti at the funeral ceremony of Supreme Leader Khamenei in Iran. pic.twitter.com/CCum4rjYNZ
— Ayushi Agarwal (@ayu_agarwal94) July 3, 2026
ఇక మరో వైపు శక్తివంతమైన ఐఆర్జీసీ జనరల్ అహ్మద్ వాహిది కనిపించారు.ఇరానీ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. శవపేటిక వద్ద విలపిస్తున్న ఫోటోలను ఇరానీ మీడియా రిలీజ్ చేసింది. ఖమేనీ శవపేటికను మోసల్లా మసీదులోనే మూడు రోజుల పాటు ఉంచనున్నారు. సోమవారం రోజున రాజధాని టెహ్రాన్‌లో ఖమేనీ పార్దీవదేహంతో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇక మంగళవారం షియాలకు పవిత్ర నగరమైన ఖోమ్ సిటీలో ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత జూలై 9వ తేదీన మాషాద పట్టణంలో ఖమేనీ పార్ధీవదేహాన్ని ఖననం చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

