చాందీపూర్: అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. టెస్ట్ ఫ్లయిట్ సందర్భంగా హీట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అతి తక్కువ ఎత్తులో పరీక్షించారు. ఈ పరీక్ష నిర్వహించిన సమయంలో సెన్సార్లు ఆ ఏరియల్ టార్గెట్‌కు చెందిన రేడార్, ఎలక్ట్రికల్ ఆప్టికల్ సిస్టమ్‌ను ట్రాక్ చేశాయి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసర్చ్, డీఆర్డీవోలు సంయుక్తంగా అభ్యాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డెవలప్ చేశాయి. ట్విన్ బూస్టర్లతో ఈ ఎయిర్ వెహికిల్ పనిచేస్తుంది. అయితే సుదీర్ఘ దూరం ప్రయాణించేందుకు ఆ వాహనంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను అమర్చారు. ఏరియల్ వెహికిల్ పరీక్ష సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోకు కంగ్రాట్స్ తెలిపారు.