హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నల్లగొండ మొదటి అదనపు సెషన్స్ జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న ఎంవీ రమేశ్.. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న వై రేణుకను సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జీగా బదిలీ అయ్యారు. కో ఆపరేటివ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా ఉన్న జీ అనుపమా చక్రవర్తిని వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా, ఖమ్మం జిల్లా జడ్జి సీహెచ్ భూపతిని జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, ఆ పదవిలో ఉన్న ఈ తిరుమలదేవిని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీగా బదిలీ చేసింది. సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి కే సునీతను నిజామాబాద్ జిల్లా జడ్జీగా, ఆదిలాబాద్ జిల్లా జడ్జి బీఎస్ జగజ్జీవన్కుమార్ను నల్లగొండ జిల్లా జడ్జీగా, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్1 చైర్పర్సన్ వీబీ నిర్మలా గీతాంబను సిటీ స్మాల్ కాజెస్కోర్టు చీఫ్ జడ్జీగా బదిలీ చేస్తూ చేసింది.