మలయాళ అగ్రహీరో టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోని దర్శకుడు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. 50వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ఇదని, దీనికోసం ఎంతో పరిశోధన చేశామని, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమాను తీర్చిదిద్దామని హీరో టొవినో థామస్ తెలిపారు.
మనుషులంతా ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, రాజకీయాలు ఎంత మారినా మనుషుల జీవన సంఘర్షణ మాత్రం ఏమీ మారలేదనే అంశాన్ని ఈ సినిమా చర్చిస్తుందని దర్శకుడు చెప్పారు. సాధారణ కథతో అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిదని నిర్మాతలు చాణక్య, చైతన్య, చరణ్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ.