బంజారాహిల్స్, ఏప్రిల్ 16: మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించిన హీరో ప్రభాస్ కారుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1600 జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని నీరూస్ చౌరస్తా వద్ద కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ బెంజ్ కారు(ఏపీ 05 సీజెడ్ 0009) అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడంతో పాటు ఎంపీ స్టిక్కర్ ఉండడం, నెంబర్ ప్లేట్లో కొన్ని అక్షరాలు తొలగించిన విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దీంతో కారు పత్రాలను పరిశీలించగా అది హీరో ప్రభాస్‌కు చెందినదని తేలింది. దీంతో బ్లాక్ ఫిలిమ్ తొలగించిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.700 జరిమానా విధించారు. కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వాడు తుండటంతో మోటార్ వాహన చట్టం కింద మరో రూ.700, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడంతో రూ.200 జరిమానా విధించారు. ఇదిలావుండగా ఈ విషయంపై ప్రభాస్ కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. పట్టుబడ్డ కారుకు..ప్రభాస్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.