Radhe shyam Pre Release Business | ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రాధే శ్యామ్. ఇండియాలో ఇప్పటివరకు చూడనంత గ్రాండ్‌గా వస్తున్న లవ్ స్టోరీ ఇది. ఒక రకంగా ఈ సినిమాను ఇండియన్ టైటానిక్ అంటున్నారు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథ ఇది. దీని కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. ప్రభాస్ గత సినిమాల మాదిరి మాస్ కమర్షియల్ అంశాలు ఇందులో అంతగా లేకపోయినా కూడా బిజినెస్ మాత్రం బాగానే జరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో కూడా రాధే శ్యామ్ భారీ బిజినెస్ చేసింది. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం.
నైజాం: 36.50 కోట్లు
సీడెడ్: 18 కోట్లు
ఉత్తరాంధ్ర: 13 కోట్లు
ఈస్ట్: 8.80 కోట్లు
వెస్ట్: 7.50 కోట్లు
గుంటూరు: 9.90 కోట్లు
కృష్ణా: 7.50 కోట్లు
నెల్లూరు: 4.00 కోట్లు
ఏపీ, తెలంగాణ ప్రీ రిలీజ్ బిజినెస్: 105.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 3 కోట్లు
కర్ణాటక: 12.80 కోట్లు
తమిళనాడు: 6 కోట్లు
కేరళ: 2.10 కోట్లు
ఓవర్సీస్: 24 కోట్లు
హిందీ: 50 కోట్లు
వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 202.80 కోట్లు
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 205 కోట్లు వసూలు చేయాలి. వరుసగా మూడు సినిమాలతో 200 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఒకే ఒక ఇండియన్ యాక్టర్‌గా చరిత్ర సృష్టించాడు ప్రభాస్. బాహుబలి ది కంక్లూజన్ 352 కోట్లు.. సాహో 270 కోట్ల బిజినెస్ చేసింది.